News March 21, 2024
మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై 14 మంది దుర్మరణం

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో 14 మంది దుర్మరణం చెందారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా పనులు చేస్తున్నా, పనులు నెమ్మదిగా సాగడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
Similar News
News April 16, 2025
మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.
News April 16, 2025
రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News April 16, 2025
రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.