News August 19, 2024

మెదక్: ఒక్క ఫొటో.. ఎన్నో మధుర జ్ఞాపకాలు !

image

ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదులుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మొదలవుతాయి. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుంది. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఫొటోతోనే సాధ్యం. ఆ ఫోటోగ్రఫీ ఒకరోజు ఉంది. అది నేడే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్పెషల్.

Similar News

News November 21, 2025

మెదక్: డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థులు సహా ప్రతీ ఒక్కరూ మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్‌లో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలనపై అధికారులు, పోలీసు సిబ్బందితో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం పెరిగిపోతూ, మహమ్మారి లా సమాజాన్ని, యువతను చెడు మార్గం వైపు నడిపిస్తుందన్నారు.

News November 21, 2025

మెదక్: కలెక్టర్‌ను కలిసిన కొత్త డీఈఓ విజయ

image

జిల్లా విద్యాధికారిగా, జిల్లా విద్యా శిక్షణ సంస్థ హవేలీ ఘనపూర్ ప్రిన్సిపల్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విజయ కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొని పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, ఆడల్ట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ మురళి ఉన్నారు.

News November 21, 2025

మెదక్: రోడ్డు ప్రమాదాలతో ప్రాణ, ఆర్థిక నష్టం: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతున్న సందర్భంగా రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలలో గణనీయమైన తగ్గుదల సాధ్యమని పేర్కొన్నారు.