News August 19, 2024
మెదక్: ఒక్క ఫొటో.. ఎన్నో మధుర జ్ఞాపకాలు !
ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదులుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మొదలవుతాయి. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుంది. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఫొటోతోనే సాధ్యం. ఆ ఫోటోగ్రఫీ ఒకరోజు ఉంది. అది నేడే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్పెషల్.
Similar News
News September 20, 2024
మెదక్ జిల్లాలో సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి: ఎస్పీ
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషి వల్ల గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగిసాయన్నారు.
News September 19, 2024
సంగారెడ్డి: క్రీడా పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం
క్రీడా పాలసీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఖాసిం బేగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ఆదేశాల మేరకు క్రీడా పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు తమ వివరాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన,క్రీడా కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు.
News September 19, 2024
MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.