News May 14, 2024

మెదక్: ఓటు వేస్తూ సెల్ఫీలు.. ఇద్దరిపై కేసు నమోదు

image

ఓటు వేస్తూ సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఇద్దరిపై కేసు నమోదైంది. SI పుష్పరాజ్‌ వివరాలు.. నర్సాపూర్‌ మం. బ్రాహ్మణపల్లికి చెందిన గణేష్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తూ ఫోన్‌లో సెల్ఫీ తీసి సోషల్ మీడియా గ్రూపులో పెట్టిన వీడియో వైరల్‌ కాగా కేసు నమోదు చేశారు. అలాగే చిలప్‌చెడ్‌ మం. రహీంగూడా తండాలో ఓ యువకుడు ఓటూ వేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ రెండు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 2, 2024

MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.

News October 1, 2024

MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.

News October 1, 2024

MDK: డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు

image

సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ అభ్యర్థులు సత్తా చాటారు. చిలపిచెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం(SGT), అక్కన్నపేటకు చెందిన జంగం నవీన్( ఫిజికల్ సైన్స్) మెదక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హత్నూర మండలం కాసాలకు చెందిన పన్యాల సాయికృష్ణ SGT సాంఘిక శాస్త్రంలో జిల్లాలోనే 2వ ర్యాంక్ సాధించగా.. అక్కన్నపేటకు చెందిన శ్రీధర్ గౌడ్ అనే యువకుడు(సాంఘిక శాస్త్రం) ఆరో ర్యాంకు సాధించారు.