News March 17, 2025

మెదక్: ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

image

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News March 18, 2025

సంగారెడ్డి: వరకట్నం వేధింపులకు వివాహిత బలి

image

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికోడ్ మండలం నాగన్‌పల్లికి చెందిన మహేశ్వరి(22)కి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో పెళ్లైంది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించడంతో మనస్తాపం చెందిన మహేశ్వరి సోమవారం ఉదయం ఉరేసుకుంది.

News March 18, 2025

మెదక్: బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని హవేలీఘనపూర్ గురుకులం ప్రిన్సిపల్ విజయనిర్మల తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2 లక్షల ఆదాయ పరిమితి మించరాదని వివరించారు.

News March 18, 2025

మెదక్: దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు.

error: Content is protected !!