News March 10, 2025

మెదక్: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

image

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్‌నగర్‌కు చెందిన అనిల్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News February 12, 2026

మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

image

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్‌లో BVRIT, తూప్రాన్‌లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 12, 2026

MDK: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు OD

image

నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు MDK జిల్లా విద్యాధికారి విజయ తెలిపారు. విధుల్లో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, కౌంటింగ్ ట్రైనింగ్ ఉన్న సిబ్బంది మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల నిర్వహణకు ఆటంకం కలగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 12, 2026

మెదక్: ఓటు వేసేందుకు రాష్ట్రం దాటాడు

image

ఓటుపై తనకున్న బాధ్యతను చాటుకున్నాడో యువకుడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రవితేజ(26) ఏపీలోని తెనాలి నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవితేజ, తన విలువైన ఓటును వేసేందుకు రాష్ట్రం దాటి సొంతూరికి చేరుకున్నాడు. ఈ యువకుడి చొరవను పలువురు అభినందించారు.