News July 19, 2024

మెదక్ కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా భారతీయ పాలన, ప్రజా విధానం అంశంపై బంగ్లాదేశ్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్స్, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర దేశస్తులు రాహుల్ రాజ్‌ను అభినందించారు.

Similar News

News November 17, 2025

నర్సాపూర్: ‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

image

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. బాల్య వివాహాలపై ఆదివారం నర్సాపూర్‌లో ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్ బాజా వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ బాలబాలికలకు వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వివాహాలు చేసే ముందు వారి వయసు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.

News November 16, 2025

కుటుంబానికి మూలశక్తి స్త్రీ: సత్యవాణి

image

భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. రామాయంపేట శిశు మందిర్లో సప్తశక్తి సంగం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. కుటుంబ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్రే అత్యంత కీలకమన్నారు.

News November 16, 2025

రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ నాగరాజు

image

మెదక్ జిల్లాలో జిన్నింగ్(పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. కావున సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని జిల్లా మార్కెటింగ్ అధికారి కే.నాగరాజు సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.