News July 18, 2024

మెదక్ కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

మెదక్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శాంతిభద్రతలకు పరిరక్షించడంలో కింది స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపడతామని చెప్పారు.

Similar News

News December 11, 2025

BREAKING: పాపన్నపేట మండలంలో తొలి విజయం

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దౌలాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు రేషబోయిన అంజయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి సునీత మీద 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

News December 11, 2025

మెదక్: మధ్యాహ్నం 1 గంట వరకు 86 % పోలింగ్

image

మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 86 % పోలింగ్ నమోదైంది. ఇంకా అనేక చోట్ల ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తయ్యాక సిబ్బంది మధ్యాహ్న భోజనం తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి విడతలో ప్రధానంగా హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్ద శంకరంపేటలో పోలింగ్ కొనసాగుతుంది.

News December 11, 2025

మెదక్: సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టరెట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా వివిధ మండలాల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లాదుర్గ్-10, హవేలి ఘన్పూర్-10 పాపన్నపేట-14, రేగోడు-12, పెద్ద శంకరంపేట-14, టేక్మాల్-14 క్రిటికల్, సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి, వాటిని కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.