News February 6, 2025

మెదక్: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ఉత్తరప్రదేశ్‌లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.

Similar News

News March 24, 2025

MDK: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

image

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్‌ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.

News March 24, 2025

ఏషియన్ పోటీలకు మెదక్ జిల్లా క్రీడాకారిణి ఎంపిక

image

ఏషియన్ అండర్ 15 మహిళల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి సాయి సిరి ఎంపికైనట్లు మెదక్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. జనవరిలో భారత జట్టు ఎంపిక ప్రక్రియలో సాయి సిరి ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల తైవాన్‌లో 26 నుంచి 30 వరకు జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనున్నారు.

News March 24, 2025

మెదక్: సైకిల్ పై వెళ్లి బస్టాండ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్ పై వెళ్లి ఆదివారం రామయంపేట బస్టాండ్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రామాయంపేట బస్టాండ్‌లో శుభ్రతకు సంబంధించిన ఆర్టీసీ డీఎంకు పలు సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను మహాలక్ష్మి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. తనిఖీ చేసిన అనంతరం ఆర్టీసీ బస్సులో మెదక్‌కు చేరుకున్నారు.

error: Content is protected !!