News November 28, 2024

మెదక్: కుతూరిని చంపిన తండ్రికి జీవిత ఖైదు

image

కూతుర్ని హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మి శారద బుధవారం తీర్పునిచ్చారు. టేక్మాల్ మండలం పాల్వంచకు చెందిన రమణయ్య(27)ను సావిత్రి రెండో పెళ్లి చేసుకుంది. కాగా అప్పటికే పుట్టిన వర్షిని(3)పై కక్ష పెంచుకున్న రమణయ్య 2021లో గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసుపై విచారించి న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.

Similar News

News October 24, 2025

మెదక్: జిల్లా యువజన క్రీడల అధికారిగా రమేష్

image

జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారిగా జి.రమేష్ అదనపు బాధ్యతలు ‌స్వీకరించారు. తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జి.రమేష్ జిల్లా యువజన, క్రీడల అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు. ఆయన వెంట జిల్లా విద్యా శాఖాధికారి ప్రొ.రాధాకిషన్, ఏఎంఓ సుదర్శన్ మూర్తి ఉన్నారు.

News October 24, 2025

MDK: ‘ఆశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం’

image

రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగ యువతను ఆశపెట్టిందని చెప్పొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లో సిబిల్ స్కోర్‌ను బట్టి లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. ఐతే ఇప్పటికీ ఈ పథకం పై లబ్ధిదారుల వివరాలు అధికారులు తెలపలేదు. ఈ పథకం ద్వారా సొంత వ్యాపార నిమిత్తం రూ.5 లక్షల రుణం ప్రభుత్వం ఇస్తుంది. ఆశ పెట్టి వదిలేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

News October 24, 2025

మెదక్: సర్పంచులు లేక మరుగునపడుతున్న గ్రామాలు!

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు సర్పంచులు లేక పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. గ్రామంలో చిన్న సమస్యను చెప్పడానికి గ్రామానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే.. అయిన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తే కోర్టులు ఎన్నికలను నిలిపివేశాయి. గ్రామాల్లో నియమించిన స్పెషల్ ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.