News October 23, 2024

మెదక్: కొండెక్కిన చికెన్ ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యావసర వస్తువులు, కూరగాయలతోపాటు చికెన్ ధర ఆకాశాన్ని తాకుతోంది. వారం రోజులుగా మెదక్‌లో చికెన్ షాపుల్లో స్కిన్ లెస్ రూ. 230, విత్ స్కిన్ రూ. 205 పలుకుతుంది. ఇక గ్రామాల్లోని చికెన్ సెటర్లల్లో రూ.250 ఉంది. దీంతో మాంసం ప్రియులు వెనక్కి తగ్గుతున్నారు. 1కేజీ తీసుకోవాలనుకున్న వారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడమే ఇందుకు కారణమని షాపు యజమానులు అంటున్నారు.

Similar News

News November 20, 2025

మెదక్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు.

News November 20, 2025

మెదక్: ‘దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలి’

image

జిల్లాలో ఎంపికైన దివ్యాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. సహాయ పరికరాలు పంపిణీ కోసం గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, 7920 మంది లబ్ధిదారులు 16 రకాల పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం సహాయ పరికరాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

News November 20, 2025

మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

image

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్‌లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.