News April 10, 2025
మెదక్: కొడుకు పెళ్లి.. అంతలోనే విషాదం

మెదక్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు శుభకార్యం.. మరొకవైపు చావు కబురు ఆ కుటుంబాన్ని కలచివేసింది.
Similar News
News September 17, 2025
మెదక్: కలెక్టరేట్ త్రివర్ణమయం

17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్ మూడు రంగుల విద్యుత్ దీపాలతో త్రివర్ణ మయంగా ముస్తాబు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
News September 16, 2025
నర్సాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు పరిశీలించారు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.
News September 16, 2025
మెదక్: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డికి 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా, ఇటీవల రాష్ట్ర హై కోర్టు 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తు 3 నెలలో అమలు చేయాలని స్పష్టంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మాడవేడి వినోద్ కుమార్, ఇమ్మడి సంతోశ్ కుమార్ తదితరులున్నారు.