News March 22, 2025

మెదక్: కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు: అదనపు కలెక్టర్

image

పొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతనే యంత్రాలు వినియోగించి పంటలను కోయించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌లో సమావేశ హాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ల యజమానులతో యాసంగి వరి కోతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి కోతలు దగ్గర పడుతున్నందున హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్‌లో ఉండాలని, 18-20 మధ్యలో ఆర్పీయం ఉండాలన్నారు.

Similar News

News November 5, 2025

మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

image

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.

News November 5, 2025

కరాటే పోటీలకు మెదక్ విద్యార్థుల ఎంపిక

image

69వ రాష్ట్రస్థాయి SGF ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు కరాటే విద్యార్థులు ఎంపికైనట్లు సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ తెలిపారు. అండర్-14 విభాగంలో విశిష్ట రాజ్, సాయిచరణ్, కనిష్కచారి, అర్మన్, అండర్-17లో అఖిల్, అండర్-19లో నిత్య సిరి, ఐశ్వర్య, అబ్దుల్లా ఎంపికయ్యారు. విద్యార్థులను SGF మెదక్ జిల్లా సెక్రెటరీ నాగరాజు, హవేలిఘనపూర్ ఎంఈఓ మధుమోహన్ అభినందించారు.