News April 6, 2025

మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

image

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Similar News

News April 24, 2025

సిద్దిపేట: అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య

image

అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన చిన్న నర్సింహా రెడ్డి(56) సిద్దిపేటలోని గ్రీన్ కాలనీలో టింబర్ డిపో నడిపిస్తున్నాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీరకపొవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News April 24, 2025

ఖేడ్: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

నారాయణఖేడ్ మండలం జి.హుక్రానాలో బుధవారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమారెడ్డి భార్య రావుల స్వప్న (40) బట్టలు ఉతికి ఆరేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైంది. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్నను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News April 24, 2025

పాపన్నపేట: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు మృతి

image

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు మృతి చెందాడు. పాపన్నపేట ఏఎస్ఐ సంగన్న కథనం ప్రకారం.. కొడుపాకకు చెందిన అవుసుల శ్రీకాంత్ (24) స్వర్ణకారుడుగా పనిచేస్తున్నాడు. ఈనెల 21న రాత్రి ఇంట్లో భార్య, తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది శ్రీకాంత్ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

error: Content is protected !!