News February 16, 2025

మెదక్: గంజాయి మత్తు పదార్థాల బారీన పడకుండా చర్యలు: కలెక్టర్

image

రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్‌ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్‌ కో-ఆర్డినేషన్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ జిల్లా ఎస్పీ పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

Similar News

News December 13, 2025

రెండో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: మెదక్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో పోలింగ్ మెటీరియల్ పంపిణీని ఆయన పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సిబ్బంది మార్గదర్శకాలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు, అనంతరం లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.

News December 13, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. జాగ్రత్తగా ఉండండి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.1, మల్చెల్మ 7.0, మెదక్ జిల్లా దామరంచ 8.2, వెల్దుర్తి 9.0, సిద్దిపేట జిల్లా తిప్పారం 8.3, పోతారెడ్డి పేట 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలోనమోదయ్యాయి. చలి తీవ్ర దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 12, 2025

ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.