News January 9, 2025

మెదక్: గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చెప్పటాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News January 21, 2025

ఖేడ్: గుండెపోటుతో 12ఏళ్ల బాలుడి మృతి

image

నారాయణఖేడ్‌లోని ఇందిరా కాలనీలో 12ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. జయమ్మ కొడుకు నితిన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం ఉదయం నిద్ర లేచిన నితిన్.. స్కూల్‌కి వెళ్లడానికి రెడీ అయ్యాడు. టీ బ్రెడ్ తాగిన అనంతరం శ్వాస సరిగ్గా రావట్లేదని తల్లికి చెప్పగా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో  స్థానికులను కంటతడి పెట్టింది.

News January 21, 2025

కాంగ్రెస్ ప్రజాపాలనపై హరీశ్ రావు సీరియస్

image

ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని అన్నారు.

News January 21, 2025

పదేళ్ల BRS పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా..?: మంత్రి పొన్నం

image

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు అయిన ఇచ్చారా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఇప్పుడు మేము కార్డులు ఇస్తామంటే రాద్ధాంతం చేస్తున్నారన్నారని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని.. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు. అర్హత ఉండి రాని వారు గ్రామ సభలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.