News January 24, 2025

మెదక్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఇవాళ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు.

Similar News

News January 26, 2025

మెదక్: కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

image

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించగా అంబేడ్కర్ సారధ్యంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

News January 26, 2025

మెదక్: లబ్దిదారుల తుది జాబితా సిద్ధం చేయాలి: సీఎస్

image

ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సూచించారు. శనివారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమావేశంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. నాలుగు సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేయాలని సీఎస్ సూచించారు.

News January 26, 2025

మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.