News March 30, 2024

మెదక్: గతం ఏకపక్షం.. ఈసారి త్రిముఖ పోరు..!

image

BRS, కాంగ్రెస్, BJP మెదక్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి జిల్లాలలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది. ఇక్కడ గతంలో 3సార్లు జరిగిన ఎన్నికల్లో ఫలితాలన్ని ఏకపక్షమని చెప్పొచ్చు. ఇక్కడ జాతీయ పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినా.. ప్రాంతీయ పార్టీ హవానే సాగింది. అయితే ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ ఏకపక్ష పోరు అసాధ్యమే అని త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Similar News

News October 31, 2025

మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

image

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్‌లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

News October 31, 2025

తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News October 31, 2025

నర్సాపూర్ అర్బన్ పార్కులో రేపు కాటేజీలు ప్రారంభం

image

మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రూ. 20 కోట్లతో ఏర్పాటు చేసిన నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ కాటేజీలను శనివారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొంటారు. ఈ ప్రారంభంతో సందర్శకుల రద్దీ, రాత్రి బస చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.