News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
Similar News
News March 16, 2025
గజ్వేల్: మొదటి ప్రయత్నంలో గ్రూప్-3లో సత్తా

గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మెుదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే వింటూ..అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు. దీంతో అతన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
News March 16, 2025
గ్రూప్-1, 2లో సత్తా చాటిన ఉపాధ్యాయుడికి కలెక్టర్ సన్మానం

గ్రూప్-1, 2లో మంచి ర్యాంకులు సాధించి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన GOVT టీచర్ మనోహర్ రావును కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించి శాలువాతో సత్కరించారు. కుల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా చేస్తున్న మనోహర్ రావు ఇటీవల ప్రకటించిన గ్రూప్ -2 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఆలాగే గ్రూప్ -1లో మంచి ర్యాంకుతో పాటు జెఎల్ ఉద్యోగానికి ఎంపికై నియామకమాయ్యారు.
News March 16, 2025
ఇందిరమ్మ మోడల్ ఇంటి పనులు పరిశీలించిన కలెక్టర్

మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పనుల పురోగతిని అంచనా వేశారు. 45 రోజులలో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు మంచి గృహాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.