News January 7, 2025
మెదక్: గీత కార్మికులకు ప్రభుత్వం చేయూత: మంత్రి పొన్నం
గీత కార్మికులకు ప్రజా ప్రభుత్వం చేయూత ఇస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మొదటి విడతలో 15 వేల మంది గీతా కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈనెల 25 లోపు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2025
మెదక్: గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చెప్పటాలని కలెక్టర్ సూచించారు.
News January 9, 2025
సిద్దిపేట: విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్
విద్యార్థులను టీచర్ చితకబాదిన ఘటన సిద్దిపేట(D) దుద్దెడ గురుకులలో జరిగింది. టెన్త్,ఇంటర్ విద్యార్థులకు ఉదయం నిర్వహించిన స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను PD వాసు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టాడు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. PDని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన వారికి సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాటపై మంత్రి దామోదర దిగ్ర్భాంతి
తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.