News June 16, 2024
మెదక్: గుప్తనిధి బంగారం అంటూ మోసం
జేసీబీ తవ్వకాల్లో బంగారం దొరికిందని మోసంతో రూ. 13 లక్షల తీసుకొని నకిలీ బంగారం అప్పగించిన ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం శివారు పాలెం గ్రామానికి చెందిన ఎం.ఆదెప్ప (32)ను అరెస్టు చేసినట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బలిజ గూడెం స్వామి మోసం చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు
Similar News
News September 18, 2024
సంగారెడ్డి: నవోదయలో ప్రవేశాలు.. ఈనెల 23 వరకు ఛాన్స్
వర్గల్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 23 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని కోరారు.
News September 18, 2024
అబద్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
News September 17, 2024
టేక్మాల్: మోడీ చిత్రపటానికి శాలువా కప్పి విషెష్
టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.