News January 21, 2025
మెదక్: గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ప్రారంభించనున్న నాలుగు పథకాలపై గ్రామ/వార్డు సభల నిర్వహణపై సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిర్వహిస్తోన్న క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా వేగవంతం చేయాలన్నారు.
Similar News
News January 22, 2025
సాంకేతికను అందిపుచ్చుకుందాం: కలెక్టర్ క్రాంతి
సాంకేతికను అందిపుచ్చుకుందామనిని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కందిలోని ఐఐటి హైదరాబాద్లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. ఐఐటి హైదరాబాద్లో ఎన్నో ప్రయోగాత్మక పరిశోధన చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. సమావేశంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.
News January 22, 2025
గజ్వేల్లో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలు
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్లో ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణారావు తెలిపారు. మెదక్ జిల్లా స్థాయి ఆటల పోటీల్లో 15 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ విద్యార్థులు సుమారుగా 1200 మంది హాజరు అవుతారన్నారు. అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హజరవుతారన్నారు.
News January 22, 2025
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
మెదక్ జిల్లా SP కార్యాలయంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో DSP సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో SP సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సరే సైబర్ మోసానికి గురైతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆశ, అత్యాశ సైబర్ నేరగాళ్ల ఆయుధాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పొద్దన్నారు.