News January 21, 2025
మెదక్: గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ప్రారంభించనున్న నాలుగు పథకాలపై గ్రామ/వార్డు సభల నిర్వహణపై సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిర్వహిస్తోన్న క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా వేగవంతం చేయాలన్నారు.
Similar News
News February 8, 2025
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై చెట్ల నర్సంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2025
మెదక్: మొదలైన భానుడి భగభగలు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడి ప్రతాపం ప్రారంభమైంది. ఎండలు అప్పుడే దంచి కొడుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు తమ ఇంట్లోని కూలర్లు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, ఫ్యాన్లు మొదలైన విద్యుత్ ఉపకరణాలను బయటకు తీసి రీపేర్లు చేయించుకుంటున్నారు. మరోవైపు ఎండలు ముదురుతుండడంతో రోడ్లపై జ్యూస్ షాపులు వెలుస్తున్నాయి.
News February 8, 2025
మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.