News December 15, 2024

మెదక్: గ్రూప్-2అభ్యర్థులకు కీలక సూచన

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డిలో 41 కేంద్రాల్లో 15,218, మెదక్ జిల్లాలో 16 కేంద్రాల్లో 5,855, సిద్దిపేటలోని 37 కేంద్రాల్లో 13,714 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అంక్షలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలన్నారు. అరగంట ముందే గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
-ALL THE BEST

Similar News

News November 26, 2025

మెదక్: ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట, టేక్మాల్ ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడతలో 160 గ్రామపంచాయతీలో 142 వార్డు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలన్నారు.

మెదక్: డైట్ ప్రిన్సిపల్‌గా ప్రొ.రాధాకిషన్

image

మెదక్‌ డైట్ ప్రిన్సిపల్‌గా తెలంగాణ హైదరాబాద్‌లోని SCERT ప్రొ.డి.రాధా కిషన్‌కు బాధ్యతలు ఇస్తూ విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా జిల్లా విద్యా శాఖాధికారి విజయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పక్షం రోజుల క్రితం వరకు ప్రొ.రాధాకిషన్ డీఈఓ, డైట్ ప్రిన్సిపల్‌గా పనిచేసి సెలవుపై వెళ్లారు.