News December 15, 2024

మెదక్: గ్రూప్-2అభ్యర్థులకు కీలక సూచన

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డిలో 41 కేంద్రాల్లో 15,218, మెదక్ జిల్లాలో 16 కేంద్రాల్లో 5,855, సిద్దిపేటలోని 37 కేంద్రాల్లో 13,714 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అంక్షలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలన్నారు. అరగంట ముందే గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
-ALL THE BEST

Similar News

News January 20, 2025

మనోహరాబాద్: మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నం

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని పాత బావిలో కుళ్లిపోయిన వ్యక్తి శవం లభ్యమైంది. శవాన్ని గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ రోడ్డులో పాత బావిలో శవాన్ని గుర్తించినట్లు వివరించారు. కుళ్లిపోయిన శవాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.

News January 20, 2025

మెదక్: పెరుగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ 8.9, జహీరాబాద్ 9.9, న్యాల్కల్ 10.2, మెదక్ జిల్లాలోని టేక్మాల్ , నార్సింగి 12.2, రామాయంపేట 12.4, సిద్దిపేట జిల్లాలోని కొండపాక 10.9, మార్కూక్ 11.2, మిర్దొడ్డి 12.0°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News January 20, 2025

MDK: రద్దీగా మారిన బస్టాండ్లు

image

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు గత 3 రోజులుగా ప్రయాణికులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో HYDలో చదువుతున్న విద్యార్థులు, పని నిమిత్తం ప్రజలు భారీగా తరలివెళ్లడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, తూప్రాన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.