News March 12, 2025
మెదక్: గ్రూప్-2లో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 3వ ర్యాంక్

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించారు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించారు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీవోలో మెదక్ జిల్లాకు వచ్చారు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.
Similar News
News March 27, 2025
బైక్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. నేరుగా A/Cకి డబ్బులు!

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ రైడింగ్, క్యాబ్ బుకింగ్ కంపెనీల ఆధిపత్యానికి ఇక గండి పడనుంది. వీరికి అధిక కమిషన్లు చెల్లిస్తూ నష్టపోతున్న డ్రైవర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. మధ్యవర్తులు లేకుండా వారు నేరుగా లబ్ధి పొందేలా త్వరలో ‘సహకార ట్యాక్సీ’ యాప్‌ను తీసుకొస్తామని లోక్‌సభలో సహకార మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఇందులో బైకులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్‌వీలర్స్‌ను సహకార సంస్థలే నమోదు చేస్తాయి.
News March 27, 2025
గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు.
News March 27, 2025
కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు ఢిల్లీలో శిక్షణ

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో “నేతృత్వ సృజన్” పేరుతో మహిళా నాయకత్వ శిక్షణ తరగతులు న్యూఢిల్లీలో 2 రోజులపాటు జరిగాయి. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.