News March 13, 2025
మెదక్: గ్రూప్- 2 మహిళా విభాగంలో సుస్మితకు 2వ ర్యాంకు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుస్మిత గ్రూప్-2 మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో ఆమె 406.5 మార్కులు పొందింది. అలాగే గ్రూప్-1 ఫలితాల్లో సైతం 401 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె కొల్చారం గురుకులంలో పీజీటీ(గణితం)గా పని చేస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
Similar News
News March 22, 2025
NTR: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. NTR(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
News March 22, 2025
కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు ‘మాక్ డ్రిల్’

బాంబు బెదిరింపు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అనే విషయంపై శుక్రవారం రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు, ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయంలో అణువణువు తనిఖీ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. మాక్ డ్రిల్ ఉద్దేశం ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వడమేనని అన్నారు.
News March 22, 2025
నల్గొండ జిల్లాకు మిస్ వరల్డ్ పోటీదారులు

ఉమ్మడి NLGలోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. మే12న నాగార్జునసాగర్‌కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు సుందరీమణులు రానున్నారు. సాగర్‌లో బౌద్ధ సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీరి పర్యటన నేపథ్యంలో నేడు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు.