News March 13, 2025
మెదక్: గ్రూప్- 2 మహిళా విభాగంలో సుస్మితకు 2వ ర్యాంకు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుస్మిత గ్రూప్-2 మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో ఆమె 406.5 మార్కులు పొందింది. అలాగే గ్రూప్-1 ఫలితాల్లో సైతం 401 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె కొల్చారం గురుకులంలో పీజీటీ(గణితం)గా పని చేస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
Similar News
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <
News November 24, 2025
ఖమ్మం: విశ్వామిత్ర చౌహాన్‌కు వరల్డ్ రికార్డు

ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ‘విశ్వ గురు వరల్డ్ రికార్డు’ను అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ కుమారి శ్రీలు, ఇంటెలిజెన్స్ ఏసీపీ రాజీవ్ రెడ్డి, నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా చౌహాన్ ఈ ప్రతిష్ఠాత్మక రికార్డును స్వీకరించారు. అతిథులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు
News November 24, 2025
నెలకు రూ.25 వేలతో ఉద్యోగాలు

ధర్మవరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఈనెల 26న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. నెలకు రూ.15,000 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు.


