News March 5, 2025
మెదక్: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

మెదక్ జిల్లా నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్మట్ పల్లి- చిల్వర్ మధ్యలో హైవే బ్రిడ్జిపై రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గంకు చెందిన బండ సాయిలు (55), మణెమ్మగా పోలీసులు గుర్తించారు. బొడ్మట్ పల్లి సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Similar News
News March 6, 2025
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
News March 6, 2025
MDK: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
News March 6, 2025
సంగారెడ్డి: మతిస్తిమితం లేని యువతిపై అత్యాచారం

మతిస్తిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆందోల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి(24) చిన్ననాటి నుంచి మతిస్తిమితం లేక పోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజు గ్రామంలో అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. నాలుగు రోజుల క్రితం శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.