News December 25, 2024
మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు: సీఎం
మెదక్ చర్చి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.35 కోట్లు ప్రకటించారు. చర్చి అభివృద్దికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. అంతకు ముందు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు.
Similar News
News December 28, 2024
మెదక్: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శివంపేటలో 13.9, నల్లవల్లి 14.2, అల్గోల్, అంగడి కిష్టాపూర్ 14.9, అల్మాయిపేట 15.0, పుల్కల్ 15.1, కాగజ్ మద్దూర్, కంకోల్, కంది, పాశమైలారం 15.2 డిగ్రీలు నమోదయ్యాయి. చాలా చోట్ల పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడగా.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
News December 28, 2024
మెదక్: మాజీ ప్రధానికి మంత్రి పొన్నం నివాళి
ఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టిన ఆయన నిరాడంబరతకు ఆదర్శం అన్నారు.
News December 27, 2024
కొల్చారం: SI సూసైడ్.. కారణం ఇదే..?
కామారెడ్డి జిల్లాలో నిన్న కొల్చారానికి చెందిన <<14983014>>SI <<>>సాయికుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మహిళ కానిస్టేబుల్తో ఉన్న పరిచయమే ఆయన మృతికి కారణంగా తెలుస్తోంది. సాయికుమార్ బీబీపేటలో SIగా పనిచేసేటప్పుడు కానిస్టేబుల్ శ్రుతితో పరిచయం ఏర్పడింది. ఈయన భిక్కనూర్కు బదిలీపై వెళ్లగా.. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ శ్రుతికి పరిచయం అయ్యాడు. కాగా, వీరి మధ్య ఏర్పడిన పరిచయమే మృతికి కారణంగా తెలుస్తోంది.