News February 1, 2025
మెదక్: చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవద్దు: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో గల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 1 జనవరి 2025 నుంచి 31 జనవరి వరకు ఆపరేషన్ స్మెల్-XI నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 122 మంది బడి మానేసి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించామన్నారు.
Similar News
News October 22, 2025
MDK: గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకీ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి డీసీవో పద్మావతి తెలిపారు. రామాయంపేట, కొల్చారం ఎస్సీ గురుకులాల్లో 2025-26 ఏడాదికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.
News October 22, 2025
మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.
News October 22, 2025
మెదక్: రాయితీపై విత్తనాలు పంపిణీ: కలెక్టర్

రేగోడ్ రైతు వేదికలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో రాయితీ పై ప్రొద్దు తిరుగుడు, శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ.. యాసంగి 2025-26 సీజన్కు గజ్వాడ గ్రామంలో 50 ఎకరాల్లో బ్లాక్ లెవెల్ డెమో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ADA టెక్నికల్ జి.విన్సెంట్ వినయ్, ADA ఇన్ఛార్జ్ రాంప్రసాద్, MAO మొహమ్మద్ జావీద్, MRO దత్తు రెడ్డి పాల్గొన్నారు.