News March 4, 2025

మెదక్: చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో ఆందోళన !

image

కరీంనగర్‌లో పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్నటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లు వేరు చేసి తాజాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన పోలింగ్‌లో తొలి ప్రాధాన్య ఓట్లతో గెలుపు కష్టమేనని పలువురు అంటున్నారు. చెల్లని ఓట్లు అధికంగా కనిపించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. వీటితో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని, ఎవరికి నష్టం కలిగిస్తాయో అన్న టెన్షన్‌ మొదలైంది.

Similar News

News March 16, 2025

RCPM: కిలో చికెన్ ఎంతంటే?

image

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాలు పుంజుకున్నట్లు తెలిపారు.

News March 16, 2025

ADB: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు DEO ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News March 16, 2025

KNR: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ఎప్పుడో?

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులు తమ డిగ్రీ ఫలితాలు ఎప్పుడా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ BSC, BCOM రెగ్యులర్, బాక్‌లాగ్ పరీక్షలు గత సంవత్సరం డిసెంబర్, జనవరి మధ్యలో నిర్వహించగా దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సకాలంలో ఫలితాలను విడుదల చేయాలని కోరారు.

error: Content is protected !!