News August 9, 2024

మెదక్ జిల్లాకు నేడు మంత్రి కొండ సురేఖ రాక

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి ఈరోజు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ విచ్చేస్తున్నట్లు జెడ్పి సీఈవో సిహెచ్ ఎల్లయ్య తెలిపారు. తూప్రాన్ ఎంపీడీవో శేషాద్రి తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. ఇస్లాంపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం చివరి రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని వివరించారు.

Similar News

News September 19, 2024

MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.

News September 19, 2024

సిద్దిపేట: అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటిన చింతమడక విద్యార్థినిలు

image

సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింతమడక జడ్పీ పాఠశాలలో విద్యార్థినులు సత్తా చాటారు. 8వ తరగతి చదువుతున్న దుంపటి రుక్మిత అండర్-1480 మీటర్ల, జెళ్ల అవంతిక 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ ఈనెల 19 నుంచి 29 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని HM కొత్త రాజిరెడ్డి తెలిపారు.
-CONGRATS

News September 18, 2024

దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు

image

అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు.