News July 28, 2024

మెదక్: జిల్లాలో ఇక స్థానిక ఎన్నికల జోష్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 1, 2024

రాంచంద్రంపురం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌లతో సమావేశం

image

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈనెల 7,8,9 డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు.

News December 1, 2024

ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది..?: హరీశ్ రావు

image

ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది.? అని ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.. బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

News December 1, 2024

నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

image

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్(24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు