News March 25, 2025
మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చిలప్ చెడ్ 36.8, కుల్చారం 36.7, వెల్దుర్తి 36.5, మెదక్ 36.4, పాపాన్నపేట్ 36.3, రేగోడ్ 36.1, అల్లాదుర్గ్ 36.0, పెద్ద శంకరంపేట 35.8, టేక్మాల్ 35.7, హవేలి ఘనపూర్ 35.6, నర్సాపూర్ 35.4, కౌడిపల్లి 35.1, మాసాయిపేట 34.9°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 24, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గఫూర్ అనే వ్యక్తి దౌల్తాబాద్‌లో కూలీ పని కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పులిమామిడి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని స్థానికులు తెలిపారు.
News April 24, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన చిన్న నర్సింహా రెడ్డి(56) సిద్దిపేటలోని గ్రీన్ కాలనీలో టింబర్ డిపో నడిపిస్తున్నాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీరకపొవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News April 24, 2025
ఖేడ్: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

నారాయణఖేడ్ మండలం జి.హుక్రానాలో బుధవారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమారెడ్డి భార్య రావుల స్వప్న (40) బట్టలు ఉతికి ఆరేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైంది. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్నను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.