News February 6, 2025

మెదక్ జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

image

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రోజుల క్రితం కిలో రూ. 240పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 210 నుంచి రూ. 220, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ కోళ్ల చనిపోవడం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

Similar News

News February 13, 2026

MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

image

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 13, 2026

మెదక్: టెన్త్ క్లాస్ టాపర్‌కు బంపర్ ఆఫర్

image

నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామాలలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానం రూ.3 లక్షల నగదు, జిల్లా టాపరుకు రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.

News February 12, 2026

మెదక్: ఓటింగ్‌లో మహిళా చైతన్యం భేష్.. !

image

మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు మరోసారి ఓటింగ్‌లో సత్తా చాటారు. 4 మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా 80.76 శాతం ఓటింగ్ నమోదు చేసి చైతన్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 44,591 మంది మహిళా ఓటర్లలో 36,015 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 4 ఛైర్మన్ స్థానాలు మహిళలకే రిజర్వ్ కావడంతో మహిళా ఓటర్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రేపటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.