News May 12, 2024
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్‌గా గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణ మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <

నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.