News February 11, 2025

మెదక్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో బోర్లు పొయ్యని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో 9.30మీటర్ల లోతులో నీటిమట్టం ఉంటే జనవరి చివరి వారంకి వచ్చేసరికి 10.94 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు పడిపోవడంతో నీరును పొదుపుగా వాడుకోవాలని తెలిపారు.

Similar News

News March 28, 2025

మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చేగుంట 40.0, నిజాంపేట్, హవేలిఘనపూర్ 39.9, కౌడిపల్లి 39.8, చిలపిచెడ్, నర్సాపూర్, కుల్చారం 39.7, పెద్దశంకరంపేట్, మెదక్ 39.6, అల్లాదుర్గ్ 39.5, రేగోడ్ 39.4, వెల్దుర్తి 39.2, పాపాన్నపేట్ 39.1, టేక్మాల్ 38.8°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News March 28, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య !

image

మెదక్ పట్టణం గాంధీ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఫారుక్(32) తన రేకుల ఇంటిలోనే ఉరివేసుకున్నట్లు కుటుంబీకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తోన్నారు.

error: Content is protected !!