News June 30, 2024

మెదక్ జిల్లాలో RRR పనులు వేగం

image

RRRకు జాతీయ హోదా, ఒకేసారి నిర్మించాలన్న నిర్ణయంతో పనులు వేగం కానున్నాయి. దీని ఉత్తర భాగం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 110KM మేర నిర్మాణం కానుంది. ఇది జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్‌, సంగారెడ్డి వయా కంది వరకు నిర్మించనున్నారు. గజ్వేల్‌, తూప్రాన్‌, సంగారెడ్డి వద్ద హైవేలతో కలవనుంది. RRR కోసం భూములు కోల్పోయిన బాధితులు మళ్లీ నిర్వాసితులు కానున్నారు. దీంతో అలైన్‌మెంటు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 27, 2026

నర్సాపూర్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్, అధికారులున్నారు.

News February 27, 2026

మెదక్: నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 27, 2026

తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

image

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు