News August 27, 2024

మెదక్ జిల్లా డీఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన మాధవి

image

మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్( డీఐఈఓ)గా మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవి మంగళవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డీఐఈఓగా పనిచేసిన సత్యనారాయణ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. మాధవి మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Similar News

News September 17, 2024

టేక్మాల్: మోడీ చిత్రపటానికి శాలువా కప్పి విషెష్

image

టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2024

MDK: ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్

image

కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని నేడు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్, రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డా. శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News September 17, 2024

సంగారెడ్డి: 1200 మంది పోలీసులతో బందోబస్తు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ సోమవారం తెలిపారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.