News September 27, 2024

మెదక్: జ్వరంతో అస్వస్థతకు గురై బాలిక మృతి

image

నిజాంపేట మండలం చల్మెడలో తీవ్ర విషాదం నెలకొంది. జ్వరంతో అనారోగ్యానికి గురై బాలిక చనిపోయంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్మెడ గ్రామానికి చెందిన కనకరాజు లత దంపతులు కుమార్తె తనుశ్రీ(7) రెండవ తరగతి చదువుతుంది. తనుశ్రీ గురువారం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ఈరోజు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News November 1, 2025

మెదక్: బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతలు వీరే..

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్‌లో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతలు వీరే. ఓపెన్‌ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్‌లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

News October 31, 2025

మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

image

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్‌లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

News October 31, 2025

తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.