News July 29, 2024
మెదక్: జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి
డెంగ్యూతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సూరారం గ్రామానికి చెందిన కుమ్మరి నిఖిల్(17) హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నారు. 5రోజులుగా జ్వరంతో బాధపడుతుంటగా బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థకు గురై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News October 6, 2024
దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం
కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
News October 5, 2024
పిల్లల భద్రత.. మన అందరి బాధ్యత: సిద్దిపేట సీపీ
దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News October 5, 2024
కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తా: జగ్గారెడ్డి
రాహుల్ గాంధీ ఇంటి ముందు హరీశ్ రావు దీక్ష చేస్తే తాను మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ముందు చేస్తానని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. BRS పదేళ్ల పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో హరీశ్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో రుణమాఫీ చేసినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.