News October 27, 2024
మెదక్: ‘టపాసుల దుకాణాలకు అనుమతి తప్పనిసరి’

దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలకు దుకాణదారులు సంబంధిత డివిజనల్ స్థాయి పోలీసు అధికారి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1884, రూల్స్ 1993 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 25, 2025
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్బందీగా పూర్తి చేయాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దశలవారీగా, లోపాలకు తావు లేకుండా పూర్తి చేస్తామని వివరించారు.
News October 25, 2025
సొంత డబ్బులు రాక ఉద్యోగుల ఇబ్బందులు: టీఎన్జీవో

ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఐదు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.
News October 25, 2025
మెదక్ ఎస్పీ కార్యాలయంలో 99 యూనిట్ల రక్త సేకరణ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 99 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలకు స్మారకంగా నిర్వహించిన ఈ శిబిరం సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సేకరించిన రక్తంలో 80 యూనిట్లు నిలోఫర్ ఆసుపత్రికి, 19 యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంకుకు తరలించారు.


