News February 17, 2025
మెదక్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News December 20, 2025
MDK: విపత్తులపై అప్రమత్తతే ప్రధానం: అదనపు కలెక్టర్ నగేష్

విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఈ నెల 22న హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాలో విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌ను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో పారిశుధ్య, వైద్య సేవలు కీలకమని పేర్కొన్నారు.
News December 20, 2025
మెదక్‌లో జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై సమీక్ష

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లు, లోక్ అదాలత్‌లో పరిష్కారానికి వచ్చే కేసుల వివరాలపై చర్చ జరిగింది. అనుకూల వాతావరణంలో కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానం, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.
News December 20, 2025
MDK: నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్

వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్‌గా వంచ భూపాల్ రెడ్డి గెలవగా గతంలో ఆయన భార్య భాగ్యమ్మ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త సర్పంచ్‌లుగా అవకాశం రావడం అరుదు అని గ్రామస్థులు అన్నారు. బుధవారం జరిగిన ఎన్నికలలో భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.


