News February 12, 2025

మెదక్: టెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్

image

ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్‌‌లో 25 , మెదక్ డివిజన్‌‌లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 12, 2025

మెదక్: 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు

image

మెదక్ జిల్లాలో 21 మండలాల్లో జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈనెల 15న ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయనున్నారు. జిల్లాలో పురుషులు 2,52,279 మంది, మహిళలు 2,71,878 మంది, ఇతరులు 9 మంది మొత్తం 5,23,966 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల కోసం 70 కేంద్రాల్లో 91 మంది ఆర్ఓలు, జడ్పీటీసీ ఎన్నికల కోసం 21+4 రిటర్నింగ్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు.

News February 12, 2025

మెదక్: అప్పులతోనే ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

image

మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (54) మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రమేశ్ పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ మార్కెట్ ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో అప్పులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఇంటిపై గల పెంట్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

News February 12, 2025

మెదక్: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!