News January 18, 2025
మెదక్: టోల్ ఫ్రీ నంబర్ మార్పు: కలెక్టర్

ప్రభుత్వం ఈనెల 26వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న పథకాలకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ మార్పు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 08455- 276155 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News February 16, 2025
మెదక్: భార్య మృతిని తట్టుకోలేక భర్త సూసైడ్

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలిపిచేడ్‌లో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాలు.. HYDకి చెందిన జగన్ రావు(60) భార్య మూడు నెలల కింద మృతి చెందడంతో మనస్థాపం చెంది మండలంలోని చిట్కుల్ శివారులో చాముండేశ్వరీ ఆలయ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News February 16, 2025
మెదక్: తమ్ముడిని కొట్టి చంపి.. ఆపై!

తమ్ముడిని హత్య చేసిన అన్నను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. మునిపల్లి మండలం చీలపల్లి చెందిన శివయ్యను శుక్రవారం సాయంత్రం తన అన్న యాదయ్య హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం యాదయ్య పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో శివయ్యను బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
News February 16, 2025
MDK: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.