News April 6, 2024
మెదక్: ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
వెల్దుర్తి మండలం కొప్పులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఒక ట్రాక్టర్ నుండి వ్యక్తి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మండల పరిధిలోని మన్నేవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన జ్వాలా నరేశ్‌గా గుర్తించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 20, 2025
మెదక్: పెరుగుతున్న చలి తీవ్రత
ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ 8.9, జహీరాబాద్ 9.9, న్యాల్కల్ 10.2, మెదక్ జిల్లాలోని టేక్మాల్ , నార్సింగి 12.2, రామాయంపేట 12.4, సిద్దిపేట జిల్లాలోని కొండపాక 10.9, మార్కూక్ 11.2, మిర్దొడ్డి 12.0°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News January 20, 2025
MDK: రద్దీగా మారిన బస్టాండ్లు
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు గత 3 రోజులుగా ప్రయాణికులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో HYDలో చదువుతున్న విద్యార్థులు, పని నిమిత్తం ప్రజలు భారీగా తరలివెళ్లడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, తూప్రాన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
News January 20, 2025
మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.