News January 25, 2025

మెదక్: తగ్గిన కోడిగుడ్ల ధరలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు అధికంగా తగ్గాయి. గతంలో రూ.7.50గా పలికిన ఒక్క కోడి గుడ్డు ధర నేడు రూ.5.50లకు పడిపోయింది. ఒక ట్రే రూ.180 ఉండేది. రేట్లు తగ్గడంతో రూ.150కు ట్రే అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్లపై మక్కువ ఉన్న ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Similar News

News December 8, 2025

మెదక్: చెక్‌పోస్టును సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్‌పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.

News December 8, 2025

మెదక్: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఆయన ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వెంటనే సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News December 8, 2025

మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

image

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.