News January 25, 2025

మెదక్: తగ్గిన కోడిగుడ్ల ధరలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు అధికంగా తగ్గాయి. గతంలో రూ.7.50గా పలికిన ఒక్క కోడి గుడ్డు ధర నేడు రూ.5.50లకు పడిపోయింది. ఒక ట్రే రూ.180 ఉండేది. రేట్లు తగ్గడంతో రూ.150కు ట్రే అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్లపై మక్కువ ఉన్న ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Similar News

News February 20, 2025

మెదక్: స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

News February 20, 2025

మెదక్: బీఆర్ఎస్ సమావేశానికి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్

image

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, వంటేరు ప్రతాపరెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

News February 19, 2025

మెదక్: ఎన్నికల విధులపై కలెక్టరేట్లో సమీక్ష

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎన్నికల విధులు విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు.

error: Content is protected !!