News May 4, 2024
మెదక్: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న వారిపై దృష్టిసారించారు.
Similar News
News December 11, 2025
మెదక్: సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కలెక్టరెట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా వివిధ మండలాల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లాదుర్గ్-10, హవేలి ఘన్పూర్-10 పాపన్నపేట-14, రేగోడు-12, పెద్ద శంకరంపేట-14, టేక్మాల్-14 క్రిటికల్, సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి, వాటిని కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
News December 11, 2025
తొగిట: పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

హవేలీ ఘనపూర్ మండలం ఎన్నికల కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ మండల తహశీల్దార్ సింధూ రేణుకతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందన్నారు. ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News December 11, 2025
మెదక్ జిల్లాలో 20.52% ఓటింగ్

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9 గంటల వరకు 20.52 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వణికించే చలి ఉన్నప్పటికీ ప్రజలు ఉదయం నుంచే ఓటు వేసేందుకు బారులు తీరి ఉన్నట్లు వివరించారు.


